Wednesday, December 26, 2007

మనోవ్యధ

Something that I came across which really moved me.

ఆటపాటలకు నోచుకోని తమ్ముళ్ళు
ఙ్నానం చిరు దివ్వెను చూడని తోబుట్టువులు
ఆకలికి అలమటిస్తూ ఎంగిలి మెతుకులే అమృతమని భావిస్తూ
మరణశయ్యపై నిర్జీవమైన తలిదండ్రులు
అడుగడుగునా ఉంటే....

ఆటలలొ గెలిచానని భ్రమపడ్డాను
అన్నగా ఓడిపోయి
మిడి మిడి ఙ్నానంతో మిడిసిపడ్దాను
తోబుట్టువుగ తలవంచడం మరచిపొయి
వ్యసనాలలో వ్యాపారాలలో మునిగి తేలుతూ సాధించిన దానికి గర్వపడ్డాను
సిగ్గుతొ కుమిలిపొవడం పొయి

దుస్థితులను చూడలేని గుడ్డివాడిని
అన్యాయాలకు తలతిప్పే చెవిటివాడిని
తెలిసిన దురాగతాలను పైకి చెప్పలేని మూగవాడిని
తోబుట్టువుగా...
కొడుకుగా....
ఒక సాటి మనిషిగా..
విఫలమైన నాకు

నువ్వంటూ ఉంటే, నువ్వంటూ వింటే
రెండిటిలొ ఒక వరమియ్యి

ఇస్తే వాళ్ళను మర్చే శక్తి నాకు ఇయ్యి
లేదా నిర్వీర్యమైన ఈ శ్వాస తియ్యి

                                                 --Unknown

0 comments: